2006లో తెలుగు భాషాభిమానులకు మావంతు సేవగా తెలుగుదుకాణం ప్రారంభించాము. చీరాల నుండి చేసిన మా ఈ ప్రయత్నం కొంతమందికి ఉపయోగపడింది. అయితే, తెలుగు దుకాణం ప్రారంభించిన నాటితో పోలిస్తే, ఈరోజు అంతర్జాలంద్వారా తెలుగు పుస్తకాలు, సాహిత్యం కొనుక్కునే అవకాశాలు చాలా మెరుగయ్యాయి.

ప్రచురణకర్తలకు చేరువలోలేని ముఖ్యకారణంగా స్థాయి పెంచడం సాధ్యపడలేదు. అందువలన, 2013 సెప్టెంబరు 20 వ తారీఖు నుండి తెలుగు దుకాణం సేవలను నిలిపి వేస్తున్నాము.

ప్రస్తుతం జరుగుతూ వున్న చందాదారుల సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు. వారి చందా పూర్తయ్యేవరకు సేవలు కొనసాగుతాయి. అలాగే, ఎవరికైనా తెలుగు భాషాభిమాని వ్యక్తిగతంగా సహకారం కోరుకుంటే, అందుబాటులో ఉండే మా ఉత్సాహం అలానే ఉంటుంది.

గత ఆరున్నర సంవత్సరాలుగా తెలుగుదుకాణాన్ని ప్రోత్సహించిన ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మరియు స్నేహితులకు ధన్యవాదములు.

ఇట్లు,

తెలుగుదుకాణం బృందం

తెలుగుదుకాణం మొదటి పుట కొరకు ఇక్కడ నొక్కండి